ఈ నరకం నుంచి బయటికి తీసుకురండి... చంద్రబాబు, పవన్ లకు కువైట్ నుంచి మహిళ కన్నీటి వేడుకోలు

  • తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసిన బాధితురాలు
  • ఇళ్ళల్లో పని అని నమ్మించి ఏజెంట్ తనను కువైట్ పంపించాడన్న బాధితురాలు
  • కువైట్‌లో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కంటతడి
బతుకు దెరువు కోసం కువైట్ వచ్చిన తాను నరకయాతన అనుభవిస్తున్నానని, తనను రక్షించాలని ఓ మహిళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను వేడుకుంది. సెల్ఫీ వీడియో తీసి తనను కాపాడాలని వారికి విజ్ఞప్తి చేసింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన భాగ్యవతి ఉపాధి కోసం కువైట్ వెళ్ళింది. పీలేరుకు చెందిన ఏజెంట్ మాయమాటలు విని మోసపోయింది.

కువైట్‌లో ఇళ్ళల్లో పని అని చెప్పి భాగ్యవతిని ఏజెంట్ అక్కడకు పంపించాడు. కానీ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆమె కన్నీరుమున్నీరైంది. తాను తిరిగి భారత్ వెళతానని యజమానిని అడిగితే, ఏజెంట్‌కు తాను ఇచ్చిన డబ్బు కడితేనే పంపిస్తానని చెబుతున్నాడని ఆమె వాపోయింది. తనను యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనను కాపాడాలని కోరింది.

Chandrababu Naidu
Pawan Kalyan
Kuwait
Andhra Pradesh
NRI
Bhagyavathi
Tirupati District

More Telugu News